అందరి దృష్టి చంద్రయాన్3 పైనే.. సేఫ్ ల్యాండింగ్ గ్యారంటీ అంటున్న ఇస్రో

అందరి దృష్టి చంద్రయాన్3 పైనే.. సేఫ్ ల్యాండింగ్  గ్యారంటీ అంటున్న ఇస్రో

దేశవ్యాప్తంగా ఉత్కంఠ.. మరికొద్ది గంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్3 సాఫ్ట్ ల్యాండింగ్ కు సిద్ధమైంది. సాయంంత్రం 5.47 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 6.04 గంటలకు ఆర్టిట్ నుంచి ల్యాండర్ విడిపోయి జాబిల్లిపై దిగనుంది. గతంలో కాకుండా ఈసారి ఖచ్చితంగా ప్రయోగం సక్సెస్ అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రయాన్ 3 విజయవంతం అయితే భారత్ కొత్త రికార్డు నెలకొల్పనుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంలో భారత్ నిలవనుంది. మరోవైపు చంద్రయాన్ 3 ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్సెస్ కావాలని సర్వమత ప్రార్థనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 

ఇపుడు అందరి దృష్టి చంద్రయాన్ 3పైనే.. చంద్రయాన్ 3 ప్రయోగంలో అత్యంత కీలక దశకు చేరుకుంది. చంద్రుడి ఉపరితలానికి అత్యంత చేరువలో ఉన్న చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సిద్దంగాఉంది. ఈ ప్రక్రియలో భాగంగా  విక్రమ్ ల్యాండర్,ప్రజ్ఒన్ రోవర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యుల్ చంద్రుడికి మరింత చేరువైంది. చంద్రుడిపై పరిశోధనలకోసం అంతరిక్షంలోకి దూసుకెళ్లిన  ఇవాళ (ఆగస్టు 23న) సాయంత్రం చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టనుంది. ఈ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. 

జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ ఈ సారి కచ్చితంగా సేఫ్​ గా దిగుతుందని ఇస్రో శాస్ర్తవేత్తలు ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. ల్యాండింగ్ టైంలో ఎలాంటి సమస్యలు వచ్చినా అధిగమించేలా ఈ సారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్  తర్వాత లోపాలను సరిద్దుకుని చంద్రయాన్ 3 ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో అంతా సాఫీగానే సాగుతోందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్  తెలిపారు.