న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ పార్టీకి మెజారిటీ కంటే ఎక్కువ సీట్లే వస్తాయని వెల్లడించాయి. ఎంసీడీలో మొత్తం 250 వార్డులు ఉండగా, కావాల్సిన మెజారిటీ 126. అయితే ఆప్ కు 145కు పైగానే సీట్లు వస్తాయని అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కు 149 – 171, బీజేపీకి 69 – 91, కాంగ్రెస్ కు 3 – 7, ఇతరులకు 5 – 9 సీట్లు వస్తాయని తేలింది. టైమ్స్ నౌ – ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కు 146 – 156, బీజేపీకి 84 – 94, కాంగ్రెస్ కు 6 –10, ఇతరులకు 4 వరకు సీట్లు వస్తాయని వెల్లడైంది.
న్యూస్ ఎక్స్ – జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కు 159–175, బీజేపీకి 70–92, కాంగ్రెస్ కు 4–7 సీట్లు వస్తాయని తేలింది. ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కు 155, బీజేపీకి 84, కాంగ్రెస్ కు 7 సీట్లు వస్తాయని వెల్లడైంది. టీవీ 9 ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ కు 145, బీజేపీకి 94, కాంగ్రెస్ కు 8, ఇతరులకు 3 సీట్లు వస్తాయని తేలింది. జీ న్యూస్ – బీఏఆర్సీ ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్‌కు 134–146, బీజేపీకి 82 – 94, కాంగ్రెస్ కు 8–14 వస్తాయని వెల్లడైంది. కాగా, గతంలో ఢిల్లీలో 3 కార్పొరేషన్లుగా ఉండగా.. ఈ ఏడాది విలీనంచేసి ఎన్నికలు నిర్వహించారు.
