రెడ్ క్రాస్ సొసైటీ సేవలు విస్తరించాలె ..కలెక్టర్ హరిచందన

రెడ్ క్రాస్ సొసైటీ సేవలు విస్తరించాలె ..కలెక్టర్  హరిచందన

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ సేవలు మరింతగా విస్తరించాలని కలెక్టర్  హరిచందన అన్నారు. బుధవారం మాసబ్ ట్యాంక్ లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ బ్రాంచ్ ను చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి తో కలిసి విజిట్​చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఎస్సెస్సీ చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. 

రెడ్ క్రాస్ భవనంలో వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ చేపట్టేందుకు మౌలిక వసతులు పరిశీలించారు.  త్వరలో ప్రారంభం కానున్న పీఎం భారతీయ జన్ ఔషధీ కేంద్రాన్ని పరిశీలించారు.  బాలికల  హైస్కూల్​ను విజిట్​చేశారు. డీఎంహెచ్ఓ వెంకటి, వయోవృద్ధుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్, బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ విజయ్ భాస్కర్ పాల్గొన్నారు.