- ఈ యేడు 6 వేల కోట్లతో 610 కి.మీ నిర్మాణం
హైదరాబాద్ : రాష్ట్రంలో నేషనల్ హైవేల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా 2014 నుంచి కేంద్రం భారీ స్థాయిలో ప్రాజెక్టులను మంజూరు చేసింది. వీటిలో చాలా పనులు ఇప్పటికే స్టార్ట్ అవ్వగా.. మరి కొన్ని పనులను త్వరలో ప్రారంభిస్తామని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ యేడు16 ప్రాజెక్టుల కింద రూ.6,343.05 కోట్లతో 614.87 కి.మీ. మేర నేషనల్ హైవేలను విస్తరించనున్నారు.
ప్రాజెక్టుల వివరాలివీ..
బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ 1.2 కి.మీ రూ.130.65 కోట్లు, హైదరాబాద్ భూపాలపట్నం ఎన్హెచ్ 39.7 కి.మీ రూ.48.2 కోట్లు, వలిగొండ తొర్రూరు 69.2 కి.మీ రూ.549.28 కోట్లు, సిద్దిపేట ఎల్కతుర్తి 63.641 కి.మీ రూ.578.85 కోట్లు, దుద్దెడ–జనగాం 45.57 కి.మీ రూ.423.48 కోట్లు, మహబూబ్నగర్–చించోలీ 167ఎన్ హెచ్ 60.255 కి.మీ రూ.703.68 కోట్లు, మెదక్–సిద్దిపేట ఎన్హెచ్ 765 డీజీ 69.978 కి.మీ రూ.882.18 కోట్లు, బోదన్–భైంసా–బాసర161 బీబీ56.4 కి.మీ రూ.644.45 కోట్లు, నిజాంపేట నుంచి తెలంగాణ బార్డర్ వరకు 161బీ 45.946 కి.మీ రూ.512.98 కోట్లు, సిరోంచ–మహదేవ్ పూర్ 353 సీ17 కి.మీ రూ.163.42 కోట్లు, కల్వకుర్తి–కొల్లాపూర్ 79.3 కి.మీ రూ.886.69 కోట్లు.
