
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత బహిష్కరించబడిన పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్(ఎహసాన్ ఉర్ రెహమాన్) గురించి సంచలన విషయాలు బయటికొచ్చాయి. ఇటీవల బహిష్కరించబడిన ఢిల్లీలో పాక్ హైకమిషన్ అధికారి డానిష్ కూడా ఒక ISI ఏజెంట్ అని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఇస్లామాబాద్‌లోని ISIలో పోస్ట్ చేయబడ్డాడు. డానిష్ పాస్‌పోర్ట్ ఇస్లామాబాద్ నుండే పాస్‌పోర్ట్ నంబర్ BE1117693 తో జారీ చేశారని తెలిపింది.
పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ఏజెంట్లను ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో నియమించారు. దీని ద్వారా ISI ఏజెంట్లు వీసా దరఖాస్తుదారులు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లతో స్నేహం, బ్లాక్‌మెయిల్, హనీ ట్రాప్‌లు ,డబ్బుతో ఆకర్షించడం ద్వారా భారత దేశానికి సంబంధించిన రహస్యాలు, సైనిక స్థావరాలపై సమాచారం ఇవ్వాలని ఫోర్స్ చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు జరిపిన విచారణలో తేలింది.
జ్యోతి మల్హోత్రా కస్టడీ పొడిగింపు
గురువారం ఉదయం హర్యానా కోర్టు కంటెంట్ రైటర్, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ జ్యోతి మల్హోత్రా పోలీసు రిమాండ్‌ను నాలుగు రోజులు పొడిగించారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 33 ఏళ్ల యూట్యూబర్‌ను ఐదు రోజుల పోలీసు రిమాండ్ ముగిసిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిచారు.
గత రెండు వారాలలో పంజాబ్, హర్యానా,ఉత్తరప్రదేశ్ నుంచి గూఢచర్యం ఆరోపణలపై 12మందిని అరెస్ట్ చేశారు. ఉత్తర భారతదేశంలో పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న గూఢచారి నెట్‌వర్క్ ఉనికి ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read:-టెర్రరిస్టులను వదిలిపెట్టేదే లేదు.. ఎక్కడుంటే అక్కడికెళ్లి చంపేస్తాం
హిసార్‌కు చెందిన జ్యోతి ట్రావెల్ విత్ JO" అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ఆమెను గత వారం న్యూ అగర్సేన్ ఎక్స్‌టెన్షన్‌లో అరెస్టు చేసి అధికారిక రహస్యాల చట్టం,భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. అయితే సైనిక లేదు రక్షణా శాఖ సంబంధిత సమాచారం మల్హోత్రా దగ్గర ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఖచ్చితంగా పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో ఆమె టచ్ లో ఉన్నట్లు గుర్తించామని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
నవంబర్ 2023 నుండి పాకిస్తాన్ హైకమిషన్‌లో సిబ్బందిగా పనిచేస్తున్న ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా టచ్‌లో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో మే 13న డానిష్‌ను భారత్ బహిష్కరించింది. డానిష్ తో మల్హోత్రాకు ఉన్న సంబంధాలపై ఆరా తీసేందుకు ఆమె మూడు మొబైల్ ఫోన్లు,ల్యాప్‌టాప్‌ను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు.మల్హోత్రాకు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను కూడా విశ్లేషిస్తున్నారు.
మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో(IB),సైనిక నిఘా అధికారులు కూడా మల్హోత్రాను ప్రశ్నించారు. మల్హోత్రా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ,కొన్ని ఇతర దేశాలను సందర్శించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మల్హోత్రాను వారు పాకిస్తాన్ నిఘా కార్యకర్తలు పావుగా వాడుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
ఏప్రిల్ 22న పహల్గాంఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం,పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల సైనిక వివాదం సమయంలో కూడా ఆమె డానిష్‌తో సంప్రదింపులు జరిపిందని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.