ఫేస్ వాష్ తప్పనిసరి కాదు

ఫేస్ వాష్ తప్పనిసరి కాదు

చాలామంది నిద్రపోయే ముందు, నిద్ర లేచాక సబ్బుతో ముఖం కడుక్కుంటారు. ఫేస్‌‌‌‌పైన ఉన్న ఆయిల్‌‌‌‌ క్లీన్‌‌‌‌ అయి పింపుల్స్ రాకుండా ఉంటుందని ఇలా చేస్తుంటారు. కానీ, ఇలా చేయడం అన్ని రకాల స్కిన్‌‌‌‌ టైప్స్‌‌‌‌కు మంచిది కాదు అంటున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌.

అందరి స్కిన్‌‌‌‌ ఒకేలా ఉండదు. కొందరికి ఆయిల్‌‌‌‌ స్కిన్ ఉంటే, ఇంకొందరికి డ్రై స్కిన్‌‌‌‌ ఉంటుంది. ఆయిల్‌‌‌‌ స్కిన్ ఉన్నవాళ్లు రోజూ రెండు పూటలా ముఖం కడుక్కోవడం మంచిది. ఎందుకంటే, నిద్రపోయినప్పుడు ముఖం పైన ఆయిల్‌‌‌‌ పేరుకుపోతుంది. దాన్ని నిద్రలేచాక క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా స్కిన్‌‌‌‌పైన ఉండిపోయి, స్కిన్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌‌‌ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువ. అదే డ్రై స్కిన్‌‌‌‌ వాళ్లకు ముఖంపైన ఆయిల్‌‌‌‌ పేరుకుపోయే అవకాశం తక్కువ. దానివల్ల బ్యాక్టీరియా పేరుకు పోవడం కూడా తక్కువే. డ్రై స్కిన్ ఉన్నవాళ్లు ఎక్కువ ఫేస్‌‌‌‌వాష్‌‌‌‌ చేసుకుంటే చర్మం పలుచబడుతుంది. ఉన్న కాస్త ఆయిల్ పోయి, తొందరగా ముడతలు పడే అవకాశం ఉంటుంది. అందుకని మీ స్కిన్‌‌‌‌ టైప్‌‌‌‌ తెలుసుకుని చర్మాన్ని క్లీన్‌‌‌‌ చేసుకోవాలి.