జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోండి... వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించండి

జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోండి... వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించండి

వృద్ధాప్యంలో మన జీవన శైలి ఆరోగ్యంపై తప్పక ప్రభావం చూపుతుంది. లైఫ్​లో తిండి, నిద్ర, వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తాయి. వృద్ధాప్యాన్ని దాచి యంగ్​గా కనిపించేందుకు ఈ పది అలవాట్లకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. 

1. డైట్​ సోడా: చాలా డైట్​ సోడాలు కృత్రిమ స్వీట్లను కలిగి ఉంటాయి. ఇవి జీవక్రియకు అంతరాయం కల్పిస్తాయి. దీంతో బరువు పెరుగుతారు.

2.కృత్రిమ స్వీటెనర్లు: అన్ని రకాల కృత్రిమ స్వీటెనర్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇవి శరీరంలో  చక్కెర శాతాన్ని పెంచి షుగర్​ వ్యాధి, హర్ట్​ డిసిసెస్​ వచ్చేలా చేస్తాయి.

3. ప్లాస్టిక్​ కంటెనర్లు: ప్లాస్టిక్​ హానికర రసాయనాలను ఆహారంలోకి పంపుతుంది. ఇవి శరీరానికి హానీ కలగజేస్తాయి. 

4. నిద్రపోయే ముందు ఫోన్​ వాడకం: నిద్ర పోయే ముందు ఫోన్​ వాడటం కూడా చాలా ప్రమాదమే. ఇది శరీరంపై ప్రభావం చూపుతుంది. ఫోన్​ విడుదల చేసే బ్లూలైట్​ నిద్రలేమికి కారణమవుతుంది. కాబట్టి శరీరానికి నిద్ర చాలా ముఖ్యం.

5.వ్యాయమాన్ని దాటవేయడం: వ్యాయామాన్ని దాటవేసే అలవాటు యవ్వనాన్ని తగ్గిస్తుంది. బీపీ, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. 

6. తక్కువ ప్రొటీన్​ ఉన్న ఆహారం: తక్కువ ప్రొటీన్​ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి పోషకాలు అందవు.

7. అధికంగా ప్రాసెస్​ చేసిన ఫుడ్స్​: అధికంగా ప్రాసెస్​ చేసిన ఉప్పుతో కూడిన స్నాక్స్, అనారోగ్య కొవ్వులు, అధిక సోడియం, ప్రిజర్వేటివ్​లతో నిండి ఉంటాయి. ఇవి హర్మోన్లు, ఆరోగ్యానికి హాని చేస్తాయి. 

8. బ్యాలెంసింగ్​ సప్లిమెంట్లు తీసుకోకపోవడం: మనం తినే ఆహారంలో అన్ని పోషకాలు, విటమిన్లు ఉండవు కాబట్టి పోషకాహార నిపుణుడు సూచించిన సప్లిమెంట్లు తీసుకోవాలి. ఇవి పోషకాలను బ్యాలెన్స్​ చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడతాయి.

9. ఏకధాటిగా కూర్చోవడం: ఏకధాటిగా గంటకు పైగా కూర్చుంటే కండరాలు బిగుసుకుపోతాయి. రక్తప్రసరణ సరిగ్గా జరగక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

10. ఎక్కువ కెఫిన్​: అధిక కెఫిన్​ తీసుకోవడం వల్ల నిద్రకు ఇబ్బంది తప్పదు. డీహైడ్రేషన్​ తదితర సమస్యలూ వచ్చే అవకాశం ఉంది. 

సో.. వీటన్నింటికి దూరంగా ఉంటే ఆరోగ్యం మీ వెంటే అంటున్నారు నిపుణులు.