పెనుబల్లి, వెలుగు : ఎక్స్‌ప్లోజివ్స్ వ్యాన్ ఓ కారును వెనక నుంచి ఢీకొట్టడంతో ఆ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టగా పదిమందికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం టోల్‌ప్లాజా వద్ద ఉన్న శివాలయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లికి చెందిన రామిశెట్టి శ్రీను అతని భార్య శ్రీదేవి, మరో ఇద్దరు బంధువులు డ్రైవర్‌తో పాటు వచ్చి కొత్తగా కొన్న కారుకు పూజ చేయించుకొని వెళ్తున్నారు. అదే టైంలో సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న ఎక్స్‌ప్లోజివ్స్ వ్యాన్ ఆ కారును దేవతలగుట్ట వద్ద ఢీకొట్టడంతో అది అదుపుతప్పి భద్రాచలం నుంచి గుంటూరు వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది.
దీంతో రామిశెట్టి శ్రీను, శ్రీదేవికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. గుంటూరు వైపు కారు లో ప్రయాణిస్తున్న సుబ్బారావు, సుశీల, అభిజ్ఞ , అజయ్‌లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ నేషనల్హైవే అంబులెన్స్‌లో పెనుబల్లి ఏరియా దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఖమ్మం హాస్పిటల్‌కు తరలించారు. వీఎం బంజర్ఎస్ఐ సూరజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.