ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 02.
పోస్టులు: 30. ప్రొబెషనరీ ఆఫీసర్ (జనరల్ అండ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్స్)
పోస్టుల సంఖ్య: జెనరలిస్ట్ 28, స్పెషలిస్ట్ (రాజ్యభాష) 02.
ఎలిజిబిలిటీ
జెనరలిస్ట్ పోస్టులకు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత.
రాజ్యభాష పోస్టులకు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ కోర్/ ఎలక్టివ్/ మేజర్ సబ్జెక్టుగా తీసుకుని హిందీ/ హిందీ అనువాదంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 55 శాతం, ఇతరులకు 60 శాతం మార్కులు ఉండాలి.
*గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో హిందీని కోర్/ ఎలక్టివ్/ మేజర్ సబ్జెక్టుగా తీసుకుని ఇంగ్లిష్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు కనీసం 55 శాతం, ఇతరులకు 60 శాతం మార్కులు ఉండాలి.
*గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్, హిందీని కోర్/ ఎలక్టివ్/ మేజర్ సబ్జెక్టుగా తీసుకుని ఏదైనా మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు కనీసం 55 శాతం, ఇతరులకు 60 శాతం మార్కులు ఉండాలి.
*గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ/ హిందీ అనువాదంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు కనీసం 55 శాతం, ఇతరులకు 60 శాతం మార్కులు ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 11.
లాస్ట్ డేట్: డిసెంబర్ 02.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో అభ్యర్థులు కనబర్చిన ప్రతిభ, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ecgc.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
