తెలంగాణలో బార్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

తెలంగాణలో బార్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

బార్ లైసెన్సుల దరఖాస్తులను మరోసారి పొడగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచింది. ఈనెల 16వ తేదీ వరకు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. 18న మున్సిపాలిటీల ఏరియాలో, 19న GHMC పరిధిలో లాటరీ విధానంలో లైసెన్స్‌దారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు ఎక్సైజ్ అధికారులు.

రాష్ట్రంలో కొత్తగా 159 బార్ల ఏర్పాటుకు దరఖాస్తుల గడువు ఈనెల 8న ముగిసింది. మొత్తం 7,360 దరఖాస్తులు రాగా.. చివరి రోజైన సోమవారం ఒక్కరోజే 5,311 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అంచనాలకు మించి దరఖాస్తులు రావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావించి… గడువు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. మొదట నిర్దేశించిన గుడువులోగా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు ఫీజు కింద రూ.73.60 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. లేటెస్టుగా గడువు పొడిగించడం ద్వారా దరఖాస్తు ఫీజు కింద రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తంగా రూ. 100 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.