
హైదరాబాద్, వెలుగు: టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ అప్లికేషన్ల గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 29 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రూ.500 ఫైన్‌తో మే 4 వరకు, వెయ్యి ఫైన్‌తో మే 8 వరకు, రూ.4 వేల ఫైన్‌తో మే 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు 35,072 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. సెంటర్లు తక్కువగా ఉండటంతో త్వరగా అప్లై చేసుకొని, దగ్గరలోని సెంటర్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మే 25న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఎడ్ సెట్ దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 25 వరకు పెంచినట్టు అధికారులు తెలిపారు. డిగ్రీ ఫైనలియర్ స్టూడెంట్లు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పటివరకు 21,456 అప్లికేషన్లు వచ్చాయన్నారు.