విశ్వదాభిరామ.. హంగామా, షురూ రా మామా!

విశ్వదాభిరామ.. హంగామా, షురూ రా మామా!

అనీల్ రావిపూడి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ -2 హిట్ అయిన విషయం తెలిసిందే. కామెడీతో వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ గా ఎఫ్-3 తెరకెక్కుతుండగా..సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒక్కొక్కటి విడుదల చేస్తూ ఆసక్తిని రేపుతుంది సినిమా యూనిట్. ఇప్పటికే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..లేటెస్ట్ గా ఎఫ్-3 పాటలను ఒక్కొక్కటి గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  మొదటి సాంగ్  లోని "లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు" లిరికల్ వీడియోను ఫిబ్రవరి -7న విడుదల చేస్తున్నట్లు తెలిపిన యూనిట్.. మూవీలోని సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. విశ్వదాభిరామ..ఎఫ్3 సాంగ్స్ హంగామా, షురూ రా మామా! అంటూ ట్వీట్ చేసిన యూనిట్ ..వెంకటేష్, వరుణ్ పోస్టర్ ను షేర్ చేసింది. దీంతో ఎఫ్ 3 సాంగ్స్ హంగామా షురూ కావడంతో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రిన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్.

ఇవి కూడా చదవండి: 

కాలుతున్న లారీ ఎక్కిన డ్రైవర్

10 అడుగుల దోశ.. 40 నిమిషాల్లో తినాలి

https://twitter.com/SVC_official/status/1489099802864340994