2023 జనవరి నాటికి పూర్తి

2023 జనవరి నాటికి పూర్తి
  • 76 రైల్వే స్టేషన్లలో ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ
  • నిర్వహణకు ఏజెన్సీల ఖరారు
  • వచ్చే జనవరి నాటికి ఏర్పాటయ్యే చాన్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అనుమానాస్పద వ్యక్తులు, పనులపై నిఘా పెట్టేందుకు రైల్వే స్టేషన్లలో ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ ​ఏర్పాటులో ఇండియన్ రైల్వే ముందడుగేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్‌‌‌‌టెల్‌‌‌‌ ఆధ్వర్యంలో వివిధ రైల్వే స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాల నెట్​వర్క్ ​ప్రాజెక్టు చేపట్టేందుకు ఏజెన్సీలు ఖరారయ్యాయి. మొదటి దశలో దేశ వ్యాప్తంగా 756 ప్రధాన స్టేషన్లు గుర్తించారు. ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 76 రైల్వే స్టేషన్లున్నాయి. 2023 జనవరి నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన స్టేషన్లలో రెండో దశలో అమలు చేస్తామన్నారు. నేరస్థులు స్టేషన్​లో ఎంటర్​అయినపుడు గుర్తించేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ సాయంతో వీడియో అనలిటిక్స్ సాఫ్ట్ వేర్​, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్​వేర్లు పని చేస్తాయన్నారు. విశ్రాంతి గదులు, రిజర్వేషన్‌‌‌‌ కౌంటర్లు, పార్కింగ్‌‌‌‌, ఎంట్రీ, ఎగ్జిట్‌‌‌‌ తదితర చోట్ల కెమెరాలు ఏర్పాటు చేస్తారు.


ప్రధాన స్టేషన్లు ఇవే..


హైదరాబాద్​లోని ఆర్ట్స్‌‌‌‌ కాలేజీ, డబిర్‌‌‌‌పుర, ఫలక్‌‌‌‌నుమా, ఉప్పుగూడ, జామై ఉస్మానియా, మలక్‌‌‌‌పేట, సీతాఫల్‌‌‌‌మండి, విద్యానగర్‌‌‌‌, యాకత్‌‌‌‌పుర, భరత్‌‌‌‌న గర్‌‌‌‌, చందానగర్‌‌‌‌, బోరబండ, ఫతేనగర్‌‌‌‌బ్రిడ్జి, హఫీజ్‌‌‌‌ పేట, హైటెక్‌‌‌‌సిటీ,  జేమ్స్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌, ఖైరతాబాద్‌‌‌‌, లక్డీకపూల్‌‌‌‌, నేచర్‌‌‌‌ క్యూర్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌, నెక్లస్‌‌‌‌ రోడ్‌‌‌‌, సంజీవయ్య పార్కు, వరంగల్‌‌‌‌, బేగంపేట, భద్రాచలం రోడ్‌‌‌‌, కాజీ పేట జంక్షన్‌‌‌‌, ఖమ్మం, ఖమ్మం, లింగంపల్లి, మహబూబాబాద్‌‌‌‌, మంచిర్యాల, రామగుండం, కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, తాండూరు, వికారాబాద్‌‌‌‌ జంక్షన్‌‌‌‌, బాసర, కాచిగూడ, కామారెడ్డితో పాటు తదితర స్టేషన్లున్నాయి.