ఎస్సీ హాస్టళ్లలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌..పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా దర్గా హాస్టల్‌‌‌‌‌‌‌‌ ఎంపిక

ఎస్సీ హాస్టళ్లలో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌..పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా దర్గా హాస్టల్‌‌‌‌‌‌‌‌ ఎంపిక

హైదరాబాద్, వెలుగు: షెడ్యూల్డు కులాల (ఎస్సీ) అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే హాస్టళ్లలో విద్యార్థుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎన్)ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా రంగారెడ్డి జిల్లాలోని దర్గా హాస్టల్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే బుధవారం మాసబ్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌లోని ఎస్సీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కాన్ఫరెన్స్ హాల్‌‌‌‌‌‌‌‌లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌పై వర్క్‌‌‌‌‌‌‌‌షాప్ నిర్వహించారు. 

ఈ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌ను ఎస్సీ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కమిషనర్ ఎన్. క్షితిజ పర్యవేక్షించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఎఫ్ఆర్ఎన్ ఆధారిత హాజరు నమోదు విధానంపై డెమో ప్రదర్శించారు. విద్యార్థుల ముఖ కవళికల ఆధారంగా వాళ్ల అటెండెన్స్ ను రికార్డ్ చేసే ప్రక్రియను వివరించారు. టెక్నికల్ సమస్యలు ఏవైనా ఉంటే సరిదిద్దాలని సీజీజీ టెక్నికల్ టీమ్‌‌‌‌‌‌‌‌ను కమిషనర్ క్షితిజ ఆదేశించారు. 

దర్గా హాస్టల్‌‌‌‌‌‌‌‌లో త్వరలోనే ఈ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేస్తామని, విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ హాస్టల్స్‌‌‌‌‌‌‌‌లో ఈ విధానాన్ని విస్తరిస్తామని కమిషనర్ ప్రకటించారు. ఈ వర్క్‌‌‌‌‌‌‌‌షాప్ లో  అడిషనల్ డైరక్టర్ శ్రీధర్, జాయింట్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.