మయన్మార్‌‌లో ఫేస్‌‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా సేవల నిలిపివేత

మయన్మార్‌‌లో ఫేస్‌‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా సేవల నిలిపివేత

యాంగాన్: మయన్మార్‌‌లో తమ సర్వీసులను నిలిపివేశారని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌‌బుక్ ఆరోపించింది. మయన్మార్ ప్రముఖ నేత ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించిన ఆ దేశ ఆర్మీ పవర్‌‌ను చేజిక్కించుకొని ఒక ఏడాది పాటు ఎమర్జెన్సీని విధించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా సేవలనూ నిలిపేస్తోందని సమాచారం. దీనిపై స్పందించిన ఫేస్‌‌బుక్ తమ సేవలను పునరుద్ధరించాలని మయన్మార్ అధికారులను కోరింది.

‘కొందరు ప్రజలు ఫేస్‌‌బుక్‌‌ను యాక్సెస్ చేసుకోలేకపోతున్నారని మాకు సమాచారం అందింది. మా సేవలను తిరిగి పునరుద్ధరింపజేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నాం. తద్వారా మయన్మార్ ప్రజలు తమ బంధువులు, మిత్రులకు సమాచారాన్ని పంపుతూ కమ్యూనికేట్ చేసుకోగలరు’ అని ఫేస్‌‌బుక్ ప్రతినిధి ఓ అంతర్జాతీయ మీడియాకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌‌ రద్దీని మానిటర్ చేసే నెట్‌‌బ్లాక్స్ కూడా మయన్మార్‌‌లో ఫేస్‌‌బుక్ సేవల నిలిపివేతపై స్పందించింది. మయన్మార్‌‌లో ఫేస్‌బుక్‌‌తోపాటు ఇన్‌‌స్టాగ్రామ్, వాట్సాప్ యాక్సెస్‌ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారని స్పష్టం చేసింది.