కరోనా దెబ్బకి ఉద్యోగులకు బంపర్ ఆఫరిచ్చిన ఫేస్ బుక్

కరోనా దెబ్బకి ఉద్యోగులకు బంపర్ ఆఫరిచ్చిన ఫేస్ బుక్

ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ అయిన ఫేస్ బుక్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫరిచ్చింది. తమ సంస్థకు చెందిన ఉద్యోగులు జూలై 2021 వరకు వర్క్ ఫ్రం హోం చేయోచ్చని తెలిపింది. కరోనా వల్ల చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. గూగుల్ కంపెనీ కూడా తమ ఉద్యోగులు జూన్ 2021 వరకు వర్క్ ఫ్రం హోంకు అవకాశమిచ్చింది. ట్విట్టర్ కూడా తన ఉద్యోగులలో కొంతమందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించింది.

ఫేసు బుక్ తన ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆఫర్ ఇవ్వడమే కాకుండా.. హోం ఆఫీసు సదుపాయాలను సమకూర్చుకోవడం కోసం 1000 డాలర్లను కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు సంస్థకు చెందిన ప్రతినిధి తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం మరియు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. తమ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కరోనావైరస్ ప్రభావం తగ్గి.. ఆఫీసులు తెరవడానికి ప్రభుత్వం అనుమతులిచ్చే వరకు కొద్ది మంది సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తామని ఫేస్ బుక్ తెలిపింది. ఏదేమైనా కరోనా కేసులు అధికంగా ఉన్నందున.. ఈ సంవత్సరం చివరివరకు కూడా యునైటెడ్ స్టేట్స్ మరియు లాటిన్ అమెరికాలలో తమ కంపెనీ కార్యాలయాలు తెరచే అవకాశం లేదని ఫేస్ బుక్ తెలిపింది.

For More News..

‘ఇండియన్ 2’ ప్రమాద బాధితులకు రూ. కోటి చెక్కులిచ్చిన కమల్ హాసన్

వీడియో పోస్ట్ చేసి మరో నటి ఆత్మహత్య

కొత్త విద్యావిధానం గురించి అపోహలు, అనుమానాలు వద్దు