కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం

కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం

కరోనా అనే కన్పించని  శత్రువుతో మనమందరం పోరాతున్నామన్నారు ప్రధాని మోడీ. వైరస్ తో ప్రజలు పడుతున్న బాధలు, ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచానికి కరోనా సవాల్ విసురుతోందన్నారు మోడీ. మన మనసులకు దగ్గరగా ఉండే ఎంతో మందిని వైరస్ బలి తీసుకుందన్నారు. ప్రతి ఒక్కరి ప్రధాన సేవకుడిగా.. అందరి బాధలనూ పంచుకుంటానని స్పష్టం చేశారు.

అంతేకాదు మనకున్న వనరులను వీలైనంత వరకు వాడుకోవడం కోసం అన్ని అడ్డంకులను తప్పిస్తున్నామని తెలిపారు మోడీ. వీలైనంత ఎక్కువ మందికి కరోనా టీకాలు వేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు 18 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశామని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందరికీ ఉచితంగా టీకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సినే రక్షణ అని అన్నారు ప్రధాని.