ముఖం చూపిస్తనే హాజరు పడ్తది

ముఖం చూపిస్తనే హాజరు పడ్తది
  • ఇక నుంచి బల్దియాలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ 
  • ఫింగర్ ప్రింట్ నమోదు స్థానంలో కొత్తగా అమలు 
  • వచ్చే నెల1 నుంచి ప్రారంభించేందుకు చర్యలు 
  •  తద్వారా కిందస్థాయి ఉద్యోగుల అక్రమాలకు చెక్  
  • జీహెచ్ ఎంసీలో 20 వేల మంది కార్మికులకు మేలు

హైదరాబాద్, వెలుగు: 
జీహెచ్ఎంసీలో శానిటేషన్ కార్మికుల ఫేక్ అటెండెన్స్ కు చెక్ పెట్టేందుకు ఏప్రిల్1 నుంచి కొత్త సిస్టం అమలులోకి రానుంది. ఇప్పటికే ప్రక్రియ కూడా మొదలైంది. ఇకముందు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్(ఎఫ్ఆర్ఎస్) యాప్ ద్వారా నమోదు చేస్తారు. ఇందుకు శనివారం అన్ని వార్డు, సర్కిల్ ఆఫీసుల్లో ఏఎంఓహెచ్ లు, ఎస్​ఎఫ్ఏలు శానిటేషన్ వర్కర్ల వివరాలను ఆన్ లైన్ లో ఎంట్రీ చేశారు. ఈ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బల్దియాలో కొన్నేళ్లుగా ఫింగర్ ప్రింట్ ద్వారా శానిటేషన్ సిబ్బంది అటెండెన్స్ తీసుకుంటున్నారు. అయితే వారి అటెండెన్స్ కు సంబంధించి కొందరు కిందిస్థాయి ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫేక్ ఫింగర్ ప్రింట్స్ తో తీసుకొని బల్దియా ఆదాయాన్ని నొక్కేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలుకు అధికారులు చర్యలు తీసుకోగా.. తద్వారా అక్రమాలకు చెక్ పడనుంది. ఫేస్ రికగ్నిషన్ ద్వారా నకిలీ అటెండెన్స్ తీసుకునే వీలులేదు. దీంతో బల్దియాతో పాటు వర్కర్లకు కూడా మేలు జరగనుంది. పాత పద్ధతిలో అయితే.. కొందరి ఫింగర్ ప్రింట్ పడకపోతుండగా కార్మికుల జీతాల్లో కోత కూడా విధించేవారు. ఇకముందు ఇలాంటి సమస్య ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. 

పనిచేయకుండానే జీతాలు.. 

బల్దియాలో18,500 మంది శానిటేషన్ వర్కర్లు పని చేస్తున్నారు. వీరి అటెండెన్స్ అంతా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్(ఎస్​ఎఫ్ఏ)లు చూస్తున్నారు. డైలీ అటెండెన్స్ తీసుకోవడం, కార్మికులతో పని చేయించడం ఎస్ఎఫ్ఏల డ్యూటీ. ఇందుకు 940 మంది ఎస్ఎఫ్ఏలు ఉన్నారు. ఒక్కొక్క ఎస్ఎఫ్ఏ మూడు గ్రూప్ ల అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో గ్రూప్ లో 7 మంది వర్కర్లు ఉంటారు. ఇలా మొత్తం 2,600 గ్రూప్ లు ఉన్నాయి. కాగా.. ఎస్ఎఫ్ఏల వద్దనే  ఫేక్ అటెండెన్స్ అక్రమాలు జరుగుతున్నట్టు అధికారుల దృష్టికి వెళ్లింది. అంతేకాకుండా వర్కర్లు పనిచేయకుండానే అటెండెన్స్ నమోదవుతుంది. ఇలాంటి కేసులు కొన్ని ఉంటే, పనిచేయకుండానే ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ద్వారా అటెండెన్స్ వేస్తూ జీతాలు తీసుకుంటున్న వారు ఉన్నారు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వాటిలో ఇలాంటి వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో బల్దియా నుంచి నిధులు పోతున్నప్పటికీ గ్రౌండ్ లేవల్లో పనులు కావడంలేదు. 

ఎస్​ఎఫ్ఏల మొబైల్ తోనే.. 

ఇన్నాళ్లు వర్కర్ల అటెండెన్స్ కోసం ఫింగర్ ప్రింట్ కి సంబంధించిన మెషీన్లు ఎస్ఎఫ్ఏలకు జీహెచ్ఎంసీ అందించేది. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ కు అలాంటి అవసరంలేదు. ఎస్ఎఫ్ఏ మొబైల్ లోనే యాన్ ద్వారా లాగిన్ అయి అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంది. ఇందుకు యూజర్ ఐడీతో పాటు పాస్ వర్డ్ ని ఒక్కో ఎస్ఎఫ్​ఏకి అందజేశారు. ఫస్ట్ టైమ్ ఫేస్ రిజిస్ర్టేషన్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం వర్కర్లు, ఎస్ఎఫ్ఏలు, ఏఎంఓహెచ్ లు ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా అంతా పూర్తికానుంది. ఆ తర్వాత అమల్లోకి రానుంది.