యూనివర్సిటీల్లో వసతులు పెంచాలి : గవర్నర్ తమిళిసై

యూనివర్సిటీల్లో వసతులు పెంచాలి :   గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో మౌలిక వసతులు మరింత పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఉన్నత విద్య అంశంలో తెలంగాణ గురించి దేశం మాట్లాడుకోవాలన్నది తన డ్రీమ్ అని పేర్కొన్నారు. సోమవారం రాజ్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కమ్యూనిటీ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లర్ కనెక్ట్స్ ఆల్మునీ మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. 

యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీల్లో చదివి, సెటిలైన వారు సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్రంలో యూనివర్సిటీల వీసీలు, విద్యావేత్తలతో కలిసి ఎవాల్యూయేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని, వర్సిటీలకు ఆల్మునీ కమిటీ అందించిన సహకారాలను పరిశీలించాలన్నారు. 

వచ్చే నెల 31న నిర్వహించే కార్యక్రమంలో ఎక్కువ సహాయం అందించిన ఆల్మునీ మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సన్మానిస్తామని గవర్నర్ వెల్లడించారు. రిమోట్ ఏరియా విద్యార్థులకు విద్యను అందించే విదంగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశామని చెప్పారు.