
భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి హెడ్ కోచ్ పదవి వరించింది. 2026 సీజన్‌కు ముందు గంగూలీ ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ఆదివారం (ఆగస్టు 24) మాజీ బీసీసీఐ చీఫ్ గంగూలీ.. ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జోనాథన్ ట్రాట్ స్థానంలో గంగూలీ హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరిస్తాడు. ట్రాట్ శనివారం (ఆగస్టు 23) ప్రిటోరియా క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. "ప్రిన్స్ క్యాపిటల్స్ శిబిరంలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. గంగూలీని మా కొత్త ప్రధాన కోచ్‌గా ప్రకటించడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము". అని సెంచూరియన్ ఫ్రాంచైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
గంగూలీ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. 2018, 2019 మధ్య గంగూలీ ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు జట్టు డైరెక్టర్‌గా ఉన్నారు. బీసీసీఐ అధ్యక్షుడైన తర్వాత ఆ పదవి నుంచి వైదొలిగాడు. 2025 సౌతాఫ్రికా 20 సీజన్‌కు ముందు ట్రాట్ ప్రధాన కోచ్‌గా విఫలమయ్యాడు. 10 మ్యాచ్ ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి నాకౌట్‌కు చేరుకోలేకపోయింది. ఆరు జట్ల ఆడబోయే సౌతాఫ్రికా టీ20 లీగ్ లో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది. ప్రిటోరియా క్యాపిటల్స్ విల్ జాక్స్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, ఆండ్రీ రస్సెల్ ను రిటైన్ చేసుకుంది.
సౌతాఫ్రికా టీ20 మెగా లీగ్ నాలుగో ఎడిషన్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ లీగ్ మూడు సీజన్ లు జరిగింది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. 2025 సీజన్ లో ఎంఐ కేప్ టౌన్ తొలిసారి ఛాంపియన్ గా అవతరించింది. ఎప్పటిలాగే మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్,జోబర్గ్ సూపర్ కింగ్స్,పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్ టౌన్,డర్బన్ సూపర్ జెయింట్స్,ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల జాబితాను ప్రకటించారు.