
హైదరాబాద్ లో కొకైన్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లోని రాంకోఠి దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇన్నోవా క్రిస్టా వాహనంలో తరలిస్తున్న కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదివారం ( ఆగస్టు 24 ) తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ రాంకోఠి వర్థమాన్ బ్యాంకు దగ్గర ఇన్నోవా క్రిస్టా వాహనంలో తరలిస్తున్న కొకైన్ ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు.
నాంపల్లికి చెందిన మిస్బాహిద్దీన్ ఖాన్, బంజారా హిల్స్ కు చెందిన అలీ అస్గర్ గులని, యూఎస్ సిటిజన్ అయిన జుబైర్ అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి 33.3 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.నిందితులను విచారించగా ,మిస్బాహిద్దీన్ ఖాన్ , అస్గర్ గులాబీ లు కొకైన్ ను తరుచు పార్టీలలో వాడుతున్నట్లు తేలింది. హైదరాబాద్ నగరంలో కొకైన్ లభ్యం కాకపోవడంతో... బెంగళూరులో ఏడాది క్రితం ఓ పార్టీలో పరిచయం అయిన మహమ్మద్ అజారుద్దీన్ వద్ద కొకైన్ ను గ్రాము 9 వేలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
►ALSO READ | స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
యూఎస్ సిటిజన్ అయిన జుబైర్ అలీ నెలన్నర క్రితం నగరానికి వచ్చాడని... వారు కొకైన్ కొనుగోలు చేసేందుకు అతని ఇన్నోవా కారును ట్రాన్స్ పోర్ట్ గా వాడుతున్నారని తెలిపారు పోలీసులు. కొకైన్ సప్లై చేస్తున్న మహమ్మద్ అజారుద్దీన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి , వారి వద్ద 33.3 గ్రాముల కొకైన్ ను సీజ్ చేసిన పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.