స్వాతి శరీర భాగాల కోసం వెతకడం ఆపేసిన పోలీసులు.. కారణం ఏంటంటే..

స్వాతి శరీర భాగాల కోసం వెతకడం ఆపేసిన పోలీసులు.. కారణం ఏంటంటే..

హైదరాబాద్: మేడిపల్లిలో భార్యను హత్య చేసి ముక్కలుముక్కలు చేసిన కేసులో కీలక  పరిణామం చోటు చేసుకుంది. హత్యకు గురైన స్వాతి శరీర భాగాలను ఆమె భర్త మహేందర్ రెడ్డి మూసీలో పడేశాడు. దీంతో.. స్వాతి శరీర భాగాల కోసం మూసీలో వెతుకులాట సాగించారు. మూసీలో సుమారు 10 కిలోమీటర్ల వరకు వెతికారు. అప్పటికీ ఆమె శరీర భాగాలు దొరకకపోవడంతో గాలింపు నిలిపివేశారు. మూసీలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపు ఆపేశారు.

ఇక.. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన స్వాతి భర్త మహేందర్ రెడ్డిని పోలీసులు రిమాండ్కు తరలించారు. మేడిపల్లి పీఎస్ పరిధి బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్లో స్వాతి అనే వివాహితను ఆమె భర్త మహేందర్ రెడ్డి విచక్షణారహితంగా చంపి ముక్కలు చేశాడు. ఈ కేసులో మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఘట్ కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాడు. స్వాతి పంజాగుట్టలోని కాల్ సెంటర్లో పనిచేసింది. ఇద్దరి మధ్య గొడవలు ఉండేవి. వికారాబాద్లో 498 కేసు కూడా అయ్యింది. పెద్దల సమక్షంలో కాంప్రమైజ్ అయ్యారు. అయినప్పటికీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేవాళ్ళు. 

ఇదే తరహాలో మొన్న.. ఆగస్ట్ 22న కూడా గొడవ పడ్డారు. స్వాతి గర్భవతి. మెడికల్ చెకప్కి తీసుకెళ్ళమని అడిగింది. ఈ విషయంలో మొదలైన గొడవ పెద్దదయింది. భార్య స్వాతిని హత్య చేయాలని మహేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. బోడుప్పల్లో ఒక హాక్సా బ్లేడ్ కొన్నాడు. ఇంట్లో ఉన్న భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత హాక్సా బ్లేడ్తో ముక్కలు ముక్కలు చేశాడు. తల ఒకసారి.. కాళ్ళు ఒకసారి.. చేతులు మరోసారి.. ఇలా మూడు సార్లు కవర్లలో చుట్టి శరీర భాగాలను ప్రతాప్ సింగారం మూసీలో పడేశాడు.