
ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర కరీంనగర్ కు చేరుకుంది. ఆదివారం ( ఆగస్టు 24 ) కరీంనగర్ లో రెండో విడత జనహిత పాదయాత్ర ప్రారంభించారు మీనాక్షి నటరాజన్. జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం ఉప్పర మల్యాల నుంచి పాదయాత్ర ప్రారంభించారు మీనాక్షి నటరాజన్.
ఈ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, మక్కాన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఉప్పర మల్యాల లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు నేతలు. ఇవాళ ప్రారంభమైన రెండో విడత జనహిత పాదయాత్ర గంగాధర మండల కేంద్రంలోని మధురానగర్ చౌరస్తాలో ముగియనుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు నేతలు.