
వికారాబాద్, వెలుగు: విద్యపరంగా వికారాబాద్జిల్లా వెనకబడి ఉందని, జిల్లా ఆస్పత్రి ఉన్నప్పటికీ సౌకర్యాల కొరతతో ప్రజలు దూర ప్రాంతాలైన హైదరాబాద్, గుల్బర్గా వెళ్లాల్సి వస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ అన్నారు. గురువారం హైదరాబాద్ నగరంలోని గాజులరామారంలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర 4వ మహాసభలకు ఆమె హాజరై మాట్లాడారు.
వికారాబాద్జిల్లా నుంచి సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్వినోద్కుమార్ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలని, ఇక్కడున్న సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కాకుండా చూడాలన్నారు.
సిమెంట్, సుద్ద ఫ్యాక్టరీల్లో, నాపరాతి గనుల్లో, పాలిషింగ్ యూనిట్లలో, కొన్ని వేల సంఖ్యలో కార్మికులు పని చేస్తున్నారని వారికి ఈఎస్ఐ ఆస్పత్రి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ దవాఖాన మంజూరైందని చెబుతున్నా నేటికీ ప్రారంభానికి నోచుకోలేదన్నారు. వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.