లక్సెట్టిపేట కాలేజీలో సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

లక్సెట్టిపేట కాలేజీలో సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, -జూనియర్ కళాశాలలో సౌకర్యాలు కల్పించాలని, సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్ రావుతో కలిసి జిల్లా ఇంటర్మీడియట్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కళాశాలకు ఫర్నీచర్, ల్యాబ్ పరికరాలు సమకూరుస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం పాత భవనంలో కొనసాగుతున్న పాఠశాలలో 126 మంది, జూనియర్ కళాశాలలో 320 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరంలో సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి  చేయాలని సూచించారు.  

రోడ్ల అభివృద్ధికి  రూ.78 కోట్లు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల నగరపాలక సంస్థలో రోడ్ల అభివృద్ధికి రూ.78 కోట్లు మంజూయ్యాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శనివారం మార్కెట్ చౌరస్తా లో మీడియాతో మాట్లాడారు. మార్కెట్ రోడ్, శ్రీనివాస, వేంకటేశ్వర టాకీస్ ఏరియా రోడ్లతోపాటు వాటర్ ట్యాంక్​శ్రీ విశ్వనాథ ఆలయం, కాలేజీ రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, ఫుట్ పాత్ పనులను జూన్ లో  ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను తొలగిస్తామని చెప్పారు.  2027 లోపు సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ నిర్మిస్తానని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎవరు చర్చకు వచ్చినా లెక్కలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ లా జీవోలు తీసుకువచ్చి, క్షీరాభిషేకం చేయించుకోవడం లేదని, పక్కాగా నిధులు తీసుకువస్తున్నానని తెలిపారు.