2వేల 306 సీసీ కెమెరాలను ఒకేసారి చూడొచ్చు : మహమూద్ అలీ

2వేల 306 సీసీ కెమెరాలను ఒకేసారి చూడొచ్చు : మహమూద్ అలీ
  • 2,306 సీసీ కెమెరాలను ఒకేసారి చూడొచ్చు
  • కమాండ్ కంట్రోల్ సెంటర్​లో మెగా స్క్రీన్ ప్రారంభించిన మహమూద్ అలీ

హైదరాబాద్, వెలుగు : బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమాండ్  కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2,306 సీసీటీవీ కెమెరాలను ఒకేసారి పర్యవేక్షించే వెసులుబాటు ఉన్న మెగా స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం ప్రారంభించారు. విపత్తు సమయాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విజిటర్స్ వ్యూ గ్యాలరీని కూడా డీజీపీ అంజనీకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన ఓపెన్ చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో జరిగే ఘటనలను సీసీ కెమెరాల్లో చూసే వెసులుబాటు ఈ మెగా స్క్రీన్ ద్వారా కలగనుంది. దీని ద్వారా అన్ని విభాగాలను నిమిషాల వ్యవధిలో అప్రమత్తం చేయనున్నారు. లా అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిరక్షించడంలో రాష్ట్ర పోలీసులు దేశంలోనే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచారని మహమూద్ అలీ అన్నారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లక్షల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ..పబ్లిక్ సేఫ్టీలో సీసీటీవీ కెమెరాలు కీరోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోషిస్తున్నాయని అన్నారు. ఈ ఏడాది హుస్సేన్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో14వేలకు పైగా గణేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయని చెప్పారు. సేఫ్ సిటీ, విమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ ప్రాజెక్టులో భాగంగా 2,500 కెమెరాలను ప్రారంభించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీటిని ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లా అండర్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లతో కోర్డినేషన్ చేస్తామని న్నారు.