ఆర్బీఐ కొత్త రూ.5,000 నోటు.. సోషల్ మీడియాలో పుకార్లు.. నిజం ఏంటంటే ?

ఆర్బీఐ కొత్త రూ.5,000 నోటు.. సోషల్ మీడియాలో పుకార్లు.. నిజం ఏంటంటే ?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్తగా రూ. 5 వేల నోటును విడుదల చేయబోతోందనే ఓ వార్త సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ఈ మెసేజ్‌తో పాటు 5 వేల నోటు ఫోటో కూడా ఉంది. ఈ నోటు విడుదల త్వరలోనే జరగబోతోందని, డిజైన్ కూడా ఫైనల్ అయ్యిందని అందులో రాసి ఉంది.
 
ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం (PIB ఫ్యాక్ట్-చెక్) ఈ వార్తను పూర్తిగా అబద్ధం అని తేల్చి చెప్పింది. ఆర్బీఐ కొత్తగా రూ.5 వేల నోటును విడుదల చేయబోతోందని ప్రచారం పూర్తిగా ఫేక్. RBI అలాంటి కరెన్సీని ఇప్పటివరకు ప్రకటించలేదు, ఆమోదించలేదు కూడా.

కొత్త నోట్ల గురించి సరైన సమాచారం కోసం ప్రజలు RBI అధికారిక వెబ్‌సైట్ మాత్రమే చూడాలని కోరారు. RBI కూడా రూ. 5,000 వంటి కొత్త, పెద్ద విలువగల నోటును విడుదల చేయబోతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సోషల్ మీడియాలో ఇలాంటి పెద్ద నోట్ల పుకార్లు తరచూ వస్తుంటాయి. వాటిలో చాలా వరకు కల్పిత ఫోటోలు ఉంటాయి. దయచేసి ఎవరైనా ఇలాంటి సమాచారాన్ని షేర్ పంచుకునే ముందు, అది నిజమైన అధికారిక వెబ్‌సైట్ల నుండి వచ్చిందా, లేదా అని  చూసుకోవాలి. RBI విధానాలు, కొత్త నోటిఫికేషన్ల గురించి తెలుసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ చూడొచ్చు.