భన్వర్ సింగ్ వచ్చేసాడు కానీ.. ఒకటి తక్కువైందట

భన్వర్ సింగ్ వచ్చేసాడు కానీ.. ఒకటి తక్కువైందట

పుష్ప 2 సెట్ లో భన్వర్ సింగ్ అడుగుపెట్టాడు. కానీ ఒకటి తక్కువైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఎం తక్కువైందంటే. ఆ పిక్ లో పుష్ప కూడా ఉండుంటే పిక్ నెక్స్ట్ లెవల్లో ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "పుష్ప ది రూల్". "పుష్ప ది రైజ్" మూవీకి సీక్వెల్ గా రానున్న ఈ సినిమాను క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు.

పుష్ప పార్ట్ వన్ భారీ విజయాన్ని అందుకున్న నేపధ్యంలో పుష్ప 2 మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే.. ఏ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ జాయిన్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు డైరెక్టర్ సుకుమార్. అంతే.. అవికాస్తా క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. అయితే ఈ పీక్ చూసిన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.. ఒకటి మిస్ అయ్యింది అంటున్నారు. చాలా రోజుల తరువాత భన్వర్ సింగ్ ను చూస్తున్నాం.. అదే పిక్ లో పుష్ప రాజ్ కూడా ఉండి ఉంటె బొమ్మ నెక్స్ట్ లెవల్లో ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా పుష్ప మూవీ నుండి రిలీజైన పుష్ప రాజ్ వీడియోకి ఆడియన్స్ నుండి నెక్స్ట్ లెవల్ రెస్పాన్స్ వచ్చింది.

దీంతో సినిమాపై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పుష్ప సినిమాలాగే ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.