చిరంజీవికి బట్టతల, బరువు తగ్గిన్రు.. మార్ఫింగ్ వీడియోలతో కంటెంట్ ప్రచారం... యూట్యూబ్ చానల్ పై కేసు నమోదు

చిరంజీవికి బట్టతల, బరువు తగ్గిన్రు.. మార్ఫింగ్ వీడియోలతో కంటెంట్ ప్రచారం... యూట్యూబ్ చానల్ పై కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: ప్రముఖ నటుడు చిరంజీవిపై తప్పుడు సమాచారంతో మార్ఫింగ్ వీడియోలు చేసి ప్రచారం చేశారనే ఆరోపణలతో ఓ యూట్యూబ్ చానల్​పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. moviemystery-u7z అనే యూట్యూబ్ చానల్​లో ఎలాంటి ఆధారాలు లేకుండానే చిరంజీవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, బట్టతలతో ఉన్నారని, బరువు తగ్గారని చూపిస్తూ మార్ఫింగ్ వీడియోలను అప్​లోడ్ చేశారు. 

ఈ వీడియోల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు, నటుడి ప్రతిష్టకు భంగం కలిగించేలా అభిమానుల్లో ఆందోళన సృష్టించారని న్యాయవాది రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇందుకు సంబంధించిన వీడియోల స్క్రీన్​షాట్​లను ఆధారాలుగా అందజేసి, సదరు యూట్యూబ్ చానల్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.