దొంగ బాబా.. మాట వినకుంటే గ్రామ బహిష్కరణే

దొంగ బాబా.. మాట వినకుంటే గ్రామ బహిష్కరణే

తనకు తాను గురూజీగా చెప్పుకుంటూ.. గ్రామంలో అనాగరిక తీర్పులు అమలు చేస్తూ.. ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నాడో వ్యక్తి. వయస్సులో పెద్దవాడని సలహా కోసం వెళితే ఏకంగా సొంత తీర్పులు అమలు చేస్తూ.. వికృతానందం పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామానికి చెందిన  కాటికాపర్ల రామారావు.. అలియాస్ కాటిపాపల బాబు గారు.. నాగరిక కాలంలో అనాగరిక శిక్షలు అమలు చేస్తున్నాడు. తీర్పు వినకుంటే గ్రామం నుంచి బహిష్కరించటం, శిక్ష అమలు చేసే క్రమంలో ముక్కు నేలకు రాయించటం, గుండు కొట్టించటం, వివస్త్రను చేయటం చేస్తున్నాడు

గతంలో ఇతను స్థానిక స్మశాన వాటికలో సుదీర్ఘకాలం కాపాలాదారుడిగా ఉండేవాడు. జ్యోతిష్యం చెప్పుకొనే జంగాల తెగకు చెందిన వాడు. ఊళ్లో ఉన్న తమ కులస్థులకు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు.  రోజూ తాగేందుకు మందు కావాలి కాబట్టి ఈయనగారి శిక్షల్లో మద్యం కూడా చేరింది. ఆడవాళ్లకు శిక్షలు విధించే క్రమంలో మద్యం బాటిళ్లు కొనుక్కుని రమ్మని ఆదేశిస్తాడు. ఈయన శిక్షలు చెప్పే ప్రదేశంలో కాటన్ల బీర్లు, ఫుళ్లుగా లిక్కర్ కనిపిస్తుంది.

శిక్షలు విధించే క్రమంలో స్థానికంగా ఉన్న యువతను, వృధ్దులను, మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు ఈ కేడీగాడు. పోలీసులు కూడా తనకు భక్తులేనని.. పంచాయతీకి వచ్చిన వారిని బెదిరిస్తూ పెత్తనం చెలాయిస్తున్నాడు. విదేశాలకు వెళ్లి చిలక జోస్యం చెప్పి.. గారడీ విద్యలు ప్రదర్శించి వచ్చిన రామారావు..  తాను ఉన్నతమైన వ్యక్తినని.. తనకు విదేశాల్లో కూడా పలుకుబడి ఉందని హెచ్చరిస్తుంటాడు. ఇతని బాధలు పడలేక కొందరు ఊరు విడిచి వెళ్లినవాళ్లు కూడా ఉన్నారంటున్నారు గ్రామస్తులు.

రామారావు బాధితులు జిల్లా వ్యాప్తంగా ఉన్నారని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. ఊళ్లో వున్న వాళ్లు తన మాట వినకుంటే స్మశానంలో క్షుద్ర పూజలు చేసి.. ప్రతి ఒక్కరికి ప్రాణహాని తలపెడతానని రామారావు బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

fake-baba-in-khammam-district-who-harasses-young-old-and-women-mentally-and-physically