
కూకట్పల్లి, వెలుగు: సిటీలో మరో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టైంది. కొన్నేండ్లుగా హైదర్నగర్లో శ్రీవ్యాస కన్సల్టెన్సీ నిర్వాహకులు యూపీలోని వీర్ బహదూర్సింగ్పూర్వాంచల్యూనివర్సిటీ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన సాయివెంకట హర్షిత్(23) 2023లో ఈ సంస్థను సంప్రదించాడు.
ఇతడి వద్ద రూ.3 లక్షలు తీసుకుని బీటెక్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇతడు మరో కన్సల్టెన్సీని సంప్రదించగా, అవి ఫేక్అని తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా , కన్సల్టెన్సీకి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.