వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు

వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు

వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. వీరిలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. 

అలాగే నిందితుల వద్ద సర్టిఫికెట్లను కొనుగోలు చేసిన మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ యూనివర్సిటీల పేరుతో ఉన్న 88 నకిలీ సర్టిఫికెట్లు, 9 నకిలీ సర్టిఫికెట్ల నమూనాలు, 4 స్టాంపులు, 1 హాలోగ్రామ్స్ తో పాటు 6 సెల్ ఫోన్లు, ఒక కలర్ ప్రింటర్, సీపీయూ, రూ.5. 37 లక్షల నగదును స్వాదీనం చేసుకున్నారు.