శంషాబాద్లో కోటిన్నర విలువైన నకిలీ సిగరెట్లు

 శంషాబాద్లో కోటిన్నర విలువైన నకిలీ సిగరెట్లు

హైదరాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీగా నకిలీ సిగరేట్లు పట్టుబడ్డాయి. గగన్ పహాడ్ లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా నకిలీ సిగరేట్లు గుర్తించారు SOT, పోలీసులు. వెంటనే నకిలీ సిగరేట్లు తరలిస్తున్న ముఠాలోని నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 నకిలీ సిగరేట్లు ప్యాకింగ్ చేసిన డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నకిలీ సిగరేట్ల విలువ కోటి 50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. నిందితులు అందరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. నలుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..