
కొడంగల్, వెలుగు : నకిలీ పత్తి విత్తనాలను వికారాబాద్ పోలీసులు, అగ్రికల్చర్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. జిల్లాలోని కొడంగల్ మండలం హస్నాబాద్‌లో బోయిని ఆశప్ప ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్టు సోమవారం పోలీసులకు సమాచారం అందింది. కొడంగల్ ఎస్ఐ భరత్‌కుమార్‌రెడ్డి, అగ్రికల్చర్ అధికారులు వెళ్లి తనిఖీ చేశారు.
20 బ్యాగుల్లో 972 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరకగా.. స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వాటి విలువ రూ. 16 .77 లక్షలు ఉంటుంది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వేణు బాబు, నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన హన్మయ్య తన ఇంట్లో నిల్వ చేశారని నిందితుడు ఆశప్ప తెలిపారు. ఏఓ లావణ్య విత్తనాలను పంచనామా చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ విత్తనాలను అమ్మినా, నిల్వ చేసినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు, అధికారులు హెచ్చరించారు.