ఫేక్ ​కరెన్సీ గ్యాంగ్​ గుట్టు రట్టు

ఫేక్ ​కరెన్సీ గ్యాంగ్​ గుట్టు రట్టు
  •     పెద్దపల్లి జిల్లాలో ఫేక్ ​కరెన్సీ గ్యాంగ్​ గుట్టు రట్టు
  •     ఐదుగురు నిందితుల అరెస్ట్ 
  •     నకిలీనోట్లు, ప్రింటర్లు స్వాధీనం

పెద్దపల్లి, వెలుగు: దొంగనోట్లు చలామణి చేస్తున్న ఓ ముఠాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు రూ. 77,400 ఫేక్ ​ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ నోట్లు తయారు చేసే రూ. 4 లక్షల విలువైన సామగ్రిని సీజ్​ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పీఎస్​లో ఏసీపీ సారంగపాణి  వివరాలు తెలియజేశారు. 4 నెలల క్రితం కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఒక నకిలీ నోట్​ఉందన్న సమాచారం మేరకు పోలీసులు అలర్ట్​ అయ్యారు. అది ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా జిల్లాలోనే నకిలీ నోట్ల ప్రింటింగ్​చలామణి జరుగుతోందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ ముఠా శుక్రవారం సుల్తానాబాద్ చెరువు కట్ట వద్ద దొంగనోట్లు మారుస్తున్నారనే సమాచారం రావడంతో సుల్తానాబాద్​ సీఐ, ఎస్సైలు మాటు వేసి పట్టుకున్నారు. దొరికిన వారిలో చల్లా రాములు, దారంగుల వెంకటి, దుగ్యాల అనిల్, పెండం నగేశ్​ ఉన్నారు. వీరి దగ్గరి నుంచి ఫేక్​ కరెన్సీతో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ ఇంద్రసేనారెడ్డి,  ఎస్సై ఉపేందర్ రావు, అశోక్​రెడ్డి, ఏఎస్సై తిరుపతి, కానిస్టేబుల్స్​ నాగయ్య,  నవ్య,  సదానందం, సుధాకర్, నవీన్, అమిత్, ఫయాజ్, పోచాలు, గణేశ్​లను సీపీ,  డీసీపీ, ఏసీపీలు అభినందించారు. క్యాష్​ రివార్డులు ఇచ్చారు.