రాజస్తాన్ ఎన్నికల్లో బిగ్ షాక్ : రూ.2 కోట్ల నకిలీ నోట్లు పట్టివేత

రాజస్తాన్ ఎన్నికల్లో బిగ్ షాక్ : రూ.2 కోట్ల నకిలీ నోట్లు పట్టివేత

రాజస్తాన్ లో దొంగ నోట్ల కలకలం చెలరేగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 2 కోట్ల రూపాయిల  నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో   ఓ వాహనంలో  భారీగా డబ్బును తలిస్తున్నారని ముందస్తు సమాచారం వచ్చిందని జోధ్ పూర్  పోలీస్ కమిషనర్ డిపి గౌరవ్ యాదవ్ తెలిపారు.  ఆ మార్గంలో తనిఖీల నిమిత్తం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

రాజస్థాన్ లో నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి.  ఈ క్రమంలో అన్ని పార్టీల నేతల డబ్బును  ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.  అయితే జోధ్ పూర్ అక్రమంగా నగదు తరలిస్తున్నారని సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు.. కారులో తరలిస్తున్న రూ. 1.97 కోట్ల నగదును   స్వాధీనం చేసుకకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు,  అయితే స్వాధీనం చేసుకున్న నగదును పరిశీలించగా .. అవి నకిలీ నోట్లని నిర్దారించినట్లు జోధ్ పూర్  పోలీస్ కమిషనర్ డిపి గౌరవ్ యాదవ్ తెలిపారు. మొదట అసలు కరెన్సీ అని భావించామన్నారు.  ఆ తర్వాత చాలా నోట్లకు ఒకే సిరీస్ నెంబర్ ఉండటంతో అనుమానం వచ్చి పరిశీలించగా అవి నకలి నోట్లని తేలాయన్నారు.ఈ కేసులో   ఈ ఆపరేషన్ లో ఏసీపీ సహా పది మంది పోలీసులున్నారు. 

దీనిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అసలు దొంగ నోట్లు ఎక్కడ ప్రింట్ చేస్తున్నారు? ఎక్కడికి తరలించారు? ఎక్కడ చలామణి చేశారు?ఇలాంటి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా భారీ మొత్తంలో నకిలీ నోట్లు పట్టుబడటం స్థానికంగా సంచలనం రేపింది. ప్రజల్లో ఆందోళన నెలకొంది.