మల్కాజ్‌గిరి, వెలుగు: వైద్య అర్హతలు లేకుండా క్లినిక్ నడుపుతున్న నేరేడ్మెట్లోని ప్రగతి నగర్‌కు చెందినషేక్ జాన్ పాషా(52) అనే నకిలీ డాక్టర్‌ను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మౌలాలిలోని షఫీ నగర్ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా పాషా క్లినిక్ నిర్వహిస్తూ.. ప్రజలను మోసగిస్తున్నట్లు ఎస్సై గణేశ్బాబుకు సమాచారం అందింది. దీంతో శనివారం తన సిబ్బందితో వెళ్లి, క్లినిక్‌పై దాడి చేశారు. పేషెంట్లకు చికిత్స అందిస్తున్న జాన్ పాషాను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో అతను ఎలాంటి వైద్య అర్హత పత్రాలు చూపించలేకపోయాడు.
తానేమీ చదువుకోకపోయినా, చాలా కాలంగా వైద్యం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు అంగీకరించాడు. క్లినిక్ నుంచి స్టెతస్కోప్, బీపీ మెషీన్, ప్రిస్క్రిప్షన్ బుక్, ఇంజెక్షన్లు, మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తును ఎస్సై ఉపేందర్‌కు అప్పగించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
