బ్రాండెడ్ పేరిట డూప్లికేట్ దందా .. జగిత్యాల జిల్లాలో జోరుగా నకిలీ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సామగ్రి

బ్రాండెడ్ పేరిట డూప్లికేట్ దందా .. జగిత్యాల జిల్లాలో జోరుగా నకిలీ ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సామగ్రి
  •  ఒరిజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డూప్లికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తుపట్టలేకపోతున్న ప్రజలు 
  • జగిత్యాల జిల్లాలో ఏటా రూ. 10 కోట్లకు పైగా దందా
  • ఇటీవల సీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసుల దాడుల్లో నకిలీల గుర్తింపు

‘ఆరు నెలల కింద జగిత్యాల పట్టణంలోని సాయిబాబా గుడి రోడ్డులోని ఓ శానిటరీ, ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులో తమ కంపెనీ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసేందుకు ప్రముఖ కంపెనీ ప్రతినిధులు వచ్చారు. కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ పైపులపై ఉన్న కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయగా అవి నకిలీగా తేలింది. వెంటనే పట్టణ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘటనా స్థలానికి చేరుకుని నకిలీ పైపులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.’

15 రోజుల కింద జగిత్యాలలోని ఓ ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శానిటరీ షాపు ఎదుట ఓ ఇంటి యజమాని ఆందోళనకు దిగాడు. ఇంటి నిర్మాణానికి అవసరమైన పైపులు, ప్లంబింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లగా, అవి నాసిరకంగా ఉండటంతో తిరిగి ఇచ్చేందుకు రాగా.. షాపు ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాగ్వాదానికి దిగాడు. అనంతరం వాటిని తీసుకుని డబ్బులు వెనక్కి ఇచ్చాడు’

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో నకిలీ ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లంబింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సామగ్రితో ప్రజలు మోసపోతున్నారు. అసలైన బ్రాండ్ల పేర్లతో నకిలీ వస్తువులను అంటగడుతూ కొందరు వ్యాపారులు భారీ లాభాలు గడిస్తున్నారు. నాణ్యతలేని ఈ వస్తువులు ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల సీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు నాలుగైదుసార్లు దాడులు చేసి నకిలీ వస్తువులు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ నకిలీ దందా కొనసాగుతూనే ఉంది. 

బ్రాండెడ్ పేర్లతో మోసం

బ్రాండెడ్ కంపెనీలకు అసలైన డీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఉన్న షాపుల్లో మాత్రమే ఒరిజినల్ సామగ్రి లభిస్తాయి. కొంతమంది వ్యాపారులు అదే పేర్లను వాడుతూ నకిలీ వస్తువులు అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఈ డూప్లికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తువులు ప్రధానంగా ఢిల్లీ, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నట్లు సమాచారం. అక్కడి లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యానుఫ్యాక్చరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిట్లలో నాణ్యతలేని సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిటీ మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేసి, బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారుచేసిన సామగ్రిని జిల్లాలో విక్రయిస్తున్నారు. 

నిజమైన బ్రాండెడ్ వస్తువుల ధరతో పోలిస్తే, ఈ నకిలీలు 30-–40 శాతం తక్కువ ధరలకు లభిస్తుండగా.. ఒరిజినల్​ఏదో, నకిలీ ఏదో తెలియక ప్రజలు వినియోగిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు కూడా నకిలీ సామగ్రిని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలో మూడు సార్లు సీసీఎస్ పోలీసులు నిర్వహించిన తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. 

ప్రమాదాలు జరిగే చాన్స్​ 

జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. ఈ ఎలక్ట్రికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లంబింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సామగ్రి దందా ఏటా దాదాపు రూ. 50 కోట్లకు పైగా జరుగుతోంది. ఈ దందాలో నకిలీ సామగ్రిల వాటా రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ నకిలీ సామగ్రి వాడుతున్న ఇళ్లకు భవిష్యత్తులో షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్లు, పేలుళ్లు వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హౌసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోన్లతో ఇళ్లు కట్టిస్తున్న మధ్యతరగతి కుటుంబాలే ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారు. ఈ ముఠాలపై జిల్లా టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వినియోగదారుల శాఖలు కలసి ప్రత్యేక దాడులు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.