- ట్రేడింగ్ పేరుతో మోసం.. రూ.1.70 కోట్ల టోకరా
ఆదిలాబాద్, వెలుగు: విద్యుత్ శాఖలో ఏఈగా పని చేస్తున్నానని, ట్రేడింగ్ పేరుతో లాభాలు వస్తాయని చెప్పి ఓ మహిళ నుంచి రూ. 1.70 కోట్లు కొట్టేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌కు చెందిన బాధితురాలు గూడూరు ఉమారాణికి కి 2014లో సల్మాన్ అలియాస్ సోలోమన్ రాజ్ తో పరిచయం ఏర్పడింది. తాను విద్యుత్ శాఖ ఏఈగా పని చేస్తున్నానని నమ్మించాడు.
ఈక్రమంలోనే 2022లో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే లాభాలు ఇస్తానని చెప్పి, ఆమె పేరుతో ఖాతా తెరిపించి పలుమార్లు డబ్బులు తీసుకున్నాడు. బాధితురాలు సన్నిహితుల నుంచి రూ.1.40 కోట్లు అప్పు తీసుకొని నగదు, బ్యాంక్ ద్వారా నిందితుడికి ఇచ్చింది. ఆమె కూతురికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మరో రూ.30 లక్షలు వసూలు చేశాడు.
అనంతరం డబ్బులు, ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.
