
వరద సాయం నిలిపేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో రావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని..వరద సాయం ఆపాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయలేదని స్పష్టం చేశారు. GHMC ఎన్నికలను నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే… తాను కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎందుకు లెటర్ రాస్తానని అన్నారు. టీఆర్ఎస్ నేతలు తన సంతకాన్ని పోర్జరీ చేసి ఫేక్ లెటర్ సృష్టించారని ఆరోపించారు.
వరద సాయంపై కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారన్నారు బండి సంజయ్. వరద సాయం ఆపిందని బీజేపీనేనని నిరూపించగలరా అని ప్రశ్నించారు. దీనిపై భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. వరద సాయం ఆపిన వాళ్లు మూర్ఖులన్నారు. దొంగపాస్ పోర్టు బ్రోకర్లకు సీఎం పదవి ఇస్తే ఇలానే ఉంటుందన్న బండి సంజయ్..సీఎం పై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.