వికారాబాద్ జిల్లాలో నకిలీ మద్యం మూఠా అరెస్ట్

వికారాబాద్ జిల్లాలో నకిలీ మద్యం మూఠా అరెస్ట్

వికారాబాద్  జిల్లాలో  నకిలీ  మద్యం  తయారీ  ముఠాను  అదుపులోకి  తీసుకున్నారు  ఎన్ఫోర్స్ మెంట్  పోలీసులు. నాగులపల్లిలో  దాడులు నిర్వహించి.. నకిలీ  మద్యం  తయారీకి  వాడే   స్పిరిట్,  క్యారమిల్  లిక్విడ్, మద్యం  బాటిళ్ళ మూతలు,  క్యాప్  సీజింగ్  మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.  ఈనెల  14న   భుదాన్  పోచంపల్లిలో  అరెస్టైన  ముఠా ద్వారా..  వికారాబాద్ జిల్లాలో  దాడులు నిర్వహించారు.  వీరి మూలాలు  ఇంకా  ఎక్కడున్నాయనే  దానిపై   దర్యాప్తు  చేస్తున్నామన్నారు.. పరిగి  ఎక్సైజ్  సిఐ  చంద్ర శేఖర్.