
2017లో కల్ట్ హిట్ 'అర్జున్ రెడ్డి' ( Arjun Reddy )తో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన నటుడు విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ). ఇటీవల వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న ఆయనకు 'కింగ్ డమ్' ( Kingdhum )మూవీ గ్రాండ్ సక్సెస్ తో తన స్థాయిని మరింత పెంచేసింది. ఆగస్టు 31న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడుతూ తన ప్రారంభ కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
నా తొలి రెమ్యూనరేషన్ రూ. 5 లక్షలే..
కేవలం రూ5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమాకు తనకు రూ.5 లక్షల రెమ్యూనరేషన్ మాత్రమే లభించిందని తెలిపారు. అప్పట్లో ఆ రూ5 లక్షలు నాకు చాలా పెద్ద మొత్తంగా అనిపించాయి. 'అర్జున్ రెడ్డి' నిజంగా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని నేను అస్సలు ఊహించలేదు" అని విజయ్ గుర్తు చేసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. ఈ ఒక్క మూవీతో విజయ్ కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలిచి, అతడిని ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసింది.
'అర్జున్ రెడ్డి' తర్వాత అగ్ర హీరోగా
'అర్జున్ రెడ్డి' సంచలనం సృష్టించిన తర్వాత, విజయ్ దేవరకొండ వరుసగా వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాల్లో నటించి, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా ఎదిగారు. ప్రస్తుతం ఆయనకు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఆయన సినిమాలకు ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇది కేవలం ఆయన నటనకే కాదు, ఆయన వ్యక్తిత్వానికి లభిస్తున్న ఆదరణగా చెప్పవచ్చు.
'కింగ్ డమ్'తో జోష్
విజయ్ నటించిన తాజా చిత్రం 'కింగ్ డమ్' జూలై 31, 2025న విడుదలైంది. నాగ వంశీ నిర్మాణంలో, గౌతమ్ తిన్ననూరి ( Gowtam Tinnanuri )దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విమర్శకుల నుండి భిన్నమైన సమీక్షలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. సినిమా విజయంపై విజయ్ మాట్లాడుతూ, ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్ అంతా తమపై నమ్మకం ఉంచిన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా విజయానికి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు కూడా ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పారు.
ALSO READ : Vijay Deverakonda 'కింగ్ డమ్ పార్ట్2 'లో స్టార్ హీరో ఎంట్రీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
ప్రస్తుతం విజయ్ మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. మరో వైపు 'కింగ్ డమ్ పార్ట్ 2'9 Kingdhum Part 2 )కూడా ఉంటుదని స్వయంగా వెల్లడించారు. ఈ పార్ట్ 2లో స్టార్ హీరో కూడా నటించబోతున్నారని తెలిపారు. 'కింగ్ డమ్' బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ తరుణంలో, రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. .