
- పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తీవ్రంగా ఖండించిన భారత్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్‌పట్ల మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ కోసం భారత్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయం కోరిందని వ్యాఖ్యానించారు. ఈ నెల 11న బ్రస్సెల్స్సమీపంలోని గ్రూట్ బిజ్ గార్డెన్ కాజిల్‌లో ఓవర్సీస్ పాకిస్తానీ ఫౌండేషన్ నిర్వహించిన క్లోజ్డ్‌డోర్ సన్మాన సభలో మునీర్ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశానికి మన సైన్యం తగిన జవాబిచ్చింది. అధునాతన భారత విమానాలను కూల్చివేసి.. అంతర్జాతీయ గౌరవాన్ని సాధించింది. దీంతో కాల్పుల విరమణ కోసం కల్పించుకోవాలంటూ ట్రంప్ దగ్గర భారత్ ప్రాధేయపడింది” అని మునీర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. మునీర్వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలని కొట్టిపారేసింది. భారత మీడియాలో మునీర్‌ను 'బ్లఫ్‌మాస్టర్' అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.