హైదరాబాద్ లో ఫేక్​ మెడిసిన్‌‌‌‌ మాఫియా గుట్టురట్టు

హైదరాబాద్ లో ఫేక్​ మెడిసిన్‌‌‌‌ మాఫియా గుట్టురట్టు
  • ఉత్తరాఖండ్‌‌‌‌ నుంచి హైదరాబాద్​కు సప్లయ్​
  • నకిలీ ట్యాబ్లెట్స్​కు బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ 
  • నలుగురు అరెస్ట్, రూ.26 లక్షలు విలువ చేసే ట్యాబ్లెట్స్ స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: నకిలీ మెడిసిన్‌‌‌‌ మాఫియా ముఠా గుట్టురట్టైంది. ఉత్తరాఖండ్‌‌‌‌ నుంచి నకిలీ మెడిసిన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను డ్రగ్ కంట్రోల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, ఉప్పల్‌‌‌‌లోని మెడికల్ ఏజెన్సీస్‌‌‌‌లో రైడ్‌‌‌‌ చేసి రూ.26 లక్షలు విలువ చేసే వివిధ రకాల యాంటీ బయెటిక్‌‌‌‌, హైపర్ టెన్షన్, కొలస్ట్రాల్ మెడిసిన్స్ సీజ్ చేశారు. వివరాలను డ్రగ్ కంట్రోల్ ​డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ కమలాసన్‌‌‌‌ రెడ్డి వెల్లడించారు.

సిటీలో నకిలీ డ్రగ్‌‌‌‌ మాఫియా..

దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన పువ్వాడ లక్ష్మణ్‌‌‌‌, సైదాబాద్‌‌‌‌కు చెందిన పోకల రమేశ్, గర్లపల్లి పూర్ణచందర్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌ ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు. పువ్వాడ లక్ష్మణ్‌‌‌‌ శివగంగా థియేటర్ సమీపంలో శ్రీవేంకటేశ్వర ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ పేరుతో గోదాం నిర్వహిస్తున్నాడు. సిటీలోని మెడికల్ షాపులకు వివిధ రకాల ట్యాబ్లెట్స్‌‌‌‌ సప్లయ్ చేస్తున్నారు. ఇందుకోసం ఉత్తరాఖండ్‌‌‌‌ కాశీపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి నకిలీ మెడిసిన్స్‌‌‌‌ కొనుగోలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.26 లక్షల విలువ చేసే ట్యాబ్లెట్స్‌‌‌‌ను ఆర్డర్ చేశారు. ప్రముఖ కంపెనీలైన సన్ ఫార్మ, గ్లిన్‌‌‌‌మార్క్‌‌‌‌ ఫార్మ, అరి స్టో ఫార్మా, టొరెంటో ఫార్మ పేర్లతో నకిలీ లేబులింగ్‌‌‌‌ చేసిన ట్యాబ్లెట్స్‌‌‌‌ను ఉత్తరాఖండ్​ నుంచి తరలించారు. ఉత్తరాఖండ్‌‌‌‌కు చెందిన నదీమ్‌‌‌‌ నుంచి ట్రాక్‌‌‌‌ ఆన్ కొరియర్స్‌‌‌‌లో నకిలీ మెడిసిన్స్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అయ్యాయి.

రెండు పార్సిల్స్‌‌‌‌లో ..

ఉత్తరాఖండ్​ నుంచి దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, ఉప్పల్‌‌‌‌లో డెలివరీ అయ్యేలా14.5 కిలోలతో ఒక పార్సిల్‌‌‌‌13.34 కిలోలతో మరో పార్సిల్‌‌‌‌ హైదరాబాద్ కు చేరాయి.  నకిలీ ట్యాబ్లెట్స్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌పై హనుమకొండ డ్రగ్ ఇన్‌‌‌‌స్పెక్టర్ కిరణ్‌‌‌‌కు సమాచారం అందింది. ఆయన వెంటనే హైదరాబాద్‌‌‌‌లోని డ్రగ్ కంట్రోల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌కు సమాచారం అందించాడు. అసిస్టెంట్ డైరెక్టర్ అంజుమ్‌‌‌‌ అబిదా ఆధ్వర్యంలో సౌత్‌‌‌‌ వెస్ట్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు దాడులు చేశారు. కొరియర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన పార్సిల్‌‌‌‌పై ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, ఉప్పల్‌‌‌‌లో పువ్వాడ లక్ష్మణ్‌‌‌‌, పోకల రమేష్‌‌‌‌, గర్లపల్లి పూర్ణచందర్‌‌‌‌‌‌‌‌ ఇండ్లు, ఏజెన్సీల్లో తనిఖీలు చేసి 26 లక్షల విలువైన నకిలీ ట్యాబ్లెట్స్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు.