
‘సాలు దొర, సెలవు దొర’ ప్రచారానికి ఈసీని బీజేపీ కోరినట్లు తప్పుడు ప్రచారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఫేక్ న్యూస్ స్టార్టయింది. త్వరలో మునుగోడు బైపోల్ జరగనున్న నేపథ్యంలో ఈ తరహా ప్రచారాన్ని స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. జరగనిది జరిగినట్లు, జరిగింది జరగనట్లు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి జనాల్లోకి వదులుతున్నారు. తాజాగా ‘సాలు దొర, సెలవు దొర’ అనే క్యాంపెయిన్‌కు ఈసీని బీజేపీ రాష్ట్ర శాఖ అనుమతి కోరినట్లు సోషల్ మీడియాలో కొందరు ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవో ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు. తమకు ఎలాంటి లేఖ రాలేదని స్పష్టం చేశారు. బీజేపీకి ఈసీ షాక్ అని గురువారం ఉదయం నుంచి కొందరు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు.
గతంలోనూ ఇదే తంతు
గతంలో జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, హుజూరాబాద్ టైంలో ఫేక్ సర్వేలను వైరల్ చేసి ఓటర్లను గందరగోళానికి గురిచేశారు. జీహెచ్ ఎంసీ లో వరదలు వచ్చినప్పుడు వరద సాయం రూ.10 వేలు ఆపాలని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ఈసీకి లేఖ రాసినట్లుగా కొందరు టీఆర్ఎస్ నేతలు ఫేక్ లెటర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు, బీజేపీకి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ క్లిప్పింగులు పెట్టి వాట్సాప్, ఫేస్బుక్లో వైరల్ చేశారు. వీటిపై సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీ ఎం ప్రసాద్‌కు ఫిర్యాదులు చేశారు. వాట్సాప్ పోస్టింగ్స్, యూఆర్ఎల్ లింక్స్‌ను కూడా ఆయనకు అందజేశారు. సంజయ్ పేరుతో మార్ఫింగ్ అయిన బ్రేకింగ్ న్యూస్‌పైనా ఫిర్యాదు ఇచ్చారు. నిందితులపై యాక్షన్ తీసుకుంటామని అప్పుడే ఏసీపీ హామీ ఇచ్చినా.. ఇప్పటికీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు.