- సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్సీ వెంకట్ కంప్లయింట్
బషీర్ బాగ్, వెలుగు : సోషల్ మీడియాలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ పై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫిర్యాదు చేశారు. ఇటీవల కేసీ వేణుగోపాల్ కేరళలోని ఒక హోటల్ లో బ్లాక్ టీ తాగిన ఫొటోని శశాంక్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్(ఎక్స్)లో BEFITTINGFACTS అకౌంట్ ద్వారా మద్యం తాగుతున్నారని తప్పుడు ప్రచారం చేశాడని ఫిర్యాదులో తెలిపాడు.
ఆ హోటల్ కు ఆల్కాహల్ పర్మిషన్ లేకపోయినా, మద్యాన్ని తెప్పించారని అసత్య ప్రచారం చేయడమే కాకుండా కేరళ పోలీస్ లకు ట్యాగ్ చేసి తప్పుదోవ పట్టించారని పేర్కొన్నాడు. శశాంక్ సింగ్ పై కేసు నమోదు చేసి శిక్షించాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఎమ్మెల్సీ వెంకట్ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.
