
దుబాయ్: గోల్డెన్ వీసాను రూ.23 లక్షలకు అందుబాటులోకి తెచ్చినట్టు మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. గోల్డెన్ వీసా దరఖాస్తులను కేవలం యూఏఈ అధికారిక ప్రభుత్వ చానెళ్ల ద్వారా మాత్రమే ప్రాసెస్ చేస్తారని, ఎటువంటి ఇంటర్నల్ లేదా ఎక్స్‌టర్నల్ కన్సల్టెన్సీ సంస్థలు ఈ ప్రక్రియలో అధికారికంగా భాగం కాదని అబుదాబి ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటింటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ ) స్పష్టం చేసింది. ఏ కన్సల్టెన్సీని ఆథరైజ్డ్ పార్టీగా గుర్తించలేదని వెల్లడించింది.