ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి

ఏకపక్ష నిర్ణయాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి
  • కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దౌర్జన్య పాలన నడుస్తోంది
  • ఏడున్నరేండ్లుగా ఉద్యోగాల్లేవ్.. ప్రమోషన్లు లేవ్.. బదిలీలేమో అడ్డగోలుగా ఉన్నాయి
  • లేనోడు ఉద్యోగం లేదని బాధపడితే.. ఉన్నోడు అడ్డగోలు జీవోలు, ప్రభుత్వ పెత్తనం వల్ల బాధపడుతున్నాడు

హైదరాబాద్: ప్రభుత్వం నడిపే వారు ప్రజలకు అనుగుణంగా పని చేయాలి కానీ ఏక పక్ష నిర్ణయాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని జస్టిస్ చంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 317 జీవో శాస్త్రీయంగా లేదని, ప్రభుత్వ నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని... వెంటనే రద్దు చేయాలని ఆయన సూచించారు.  శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 317 జీవోపై టీజేఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.  వివిధ సంఘాల నేతలు హర్షవర్ధన్ రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 
సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. అడ్డగోలు జీవో లు సరికాదని,  స్థానికత విషయంలో అందరి అభిప్రాయం అవసరం అన్నారు. 

ఉద్యోగాల్లేవు.. ప్రమోషన్లు లేవు.. బదిలీలు అడ్డగోలుగా ఉన్నాయి: అద్దంకి దయాకర్
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ  ఈ ఏడున్నర ఏండ్ల కాలంలో ఉద్యోగాలు లేవు, ప్రమోషన్లు లేవు కానీ బదిలీలు ఏమో అడ్డగోలుగా ఉన్నాయన్నారు. 317 జీవో అనేది లక్ష్యం లేని,  జ్ఞానం లేని జీవో అన్నారు. ఈ జీవో వల్ల చాలా మంది ఉద్యోగులు నష్టపోతున్నారని విమర్శించారు. ఏ ప్రతిపాదికన స్థానికత నిర్దారించారు ? అని ఆయన ప్రశ్నించారు. జూనియర్లు తీవ్రంగా నష్టపోతున్నారు, పరిపాలన సౌలభ్యం అంటూ అడ్డగోలుగా జిల్లాలను విభజించారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకం అని గుర్తు చేశారు. ఉద్యోగం లేనోడు లేక బాధపడితే ఉన్నోడు అడ్డగోలు జీ.వో ల వల్ల, ప్రభుత్వ పెత్తనం వల్ల బాధపడుతున్నాడని అన్నారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు గౌరవం లేదు.. బానిసల్లగా చూస్తున్నాడని ఆరోపించారు. రెండు తరాల యువత భవిష్యత్తు అంధకారం అవుతోందని.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దౌర్జన్య పాలన కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులా  ??? ఆనాడు కేసీఆర్ గత ప్రభుత్వలను ప్రశ్నించలేదా  ?? అని అద్దంకి దయాకర్ నిలదీశారు. కేసీఆర్ పాలన పోతేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. 

ఆర్ధిక సమస్యలు లేని బదిలీల కోసం ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తోంది ?  జూలకంటి రంగారెడ్డి
మాజి ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ‘ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం... హామీలు తీర్చట్లేదు, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అంటే అర్థం చేసుకున్నాం.. కానీ ఎలాంటి ఆర్థిక సమస్య లేని బదిలీల కోసం ఎందుకు ఇంత మొండిగా వ్యవహారిస్తోంది ప్రభుత్వం.. ఈ జీవో వల్ల ఉద్యోగుల భవిష్యత్ ఎలా ఉంటది అని ఆలోచించే బాధ్యత ప్రభుత్వం మీద లేదా ? ఎవరి ఆమోదం,  ఎవరి అభిప్రాయం తీసుకుని ఈ జీవో తెచ్చారు... ఏకపక్ష నిర్ణయాలు సరికాదు...ఉద్యోగుల బాధ, వారి కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోవాలి..’’ అన్నారు. ఇప్పటికే ఆరుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు... ఈ జీ.వో ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు... తొందరపడి జీవో చేశారు.. ఇప్పటికైనా సవరించాలి... మొండి వైఖరి సరికాదు అని జూలకంటి రంగారెడ్డి అన్నారు. సమావేశంలో మాట్లాడిన మిగిలిన వక్తల ప్రసంగాలు కింద వీడియోలో చూడండి.

 

 

ఇవి కూడా చదవండి

ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

ఎన్నికల్లో అక్క పోటీ చేస్తోందని సోనూసూద్ కీలక నిర్ణయం