కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో 10 మంది పేర్లు

కుటుంబం ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో 10 మంది పేర్లు

మేడ్చల్ జిల్లా నాగరంలో దారుణం జరిగింది.   వెస్ట్ గాంధీ నగర్‌లో నివసిస్తోన్న ఒకే కుటుంబానికి  చెందిన నలుగురు ఆత్మహత్య  చేసుకున్నారు. మృతులను భిక్షపతి, ఆయన భార్య ఉష,  కొడుకు యశ్వంత్,  కూతురు అక్షితగా గుర్తించారు.  వీరిది యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణుగుంట. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు  చేశారు.  అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భిక్షపతి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఉన్నంతలో కుటుంబం ఆనందంగా ఉండేదని బంధువులు అంటున్నారు. కాగా.. భిక్షపతి ఇంట్లో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో 10 మంది పేర్లు రాసి ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.