సిజేరియన్ల తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నం : కర్ణన్‌‌

సిజేరియన్ల తగ్గింపునకు చర్యలు తీసుకుంటున్నం : కర్ణన్‌‌

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు హాస్పిటళ్లలో సిజేరియన్ డెలివరీలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్‌‌‌‌.వీ కర్ణన్‌‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటళ్లలో సిజేరియన్ డెలివరీల శాతం భారీగా పెరగడంపై వెలుగులో ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు. సిజేరియన్ డెలివరీలపై మానిటర్ చేస్తున్నామని చెప్పారు.

గర్భిణులకు, వారి పేరెంట్స్ కు నార్మల్ డెలివరీ వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తున్నాని తెలిపారు. బర్త్ ముహుర్తాలు పెడుతున్న పంతుళ్లు, ఆ ముహుర్తాల ప్రకారం సిజేరియన్ చేస్తున్న డాక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఇలాంటివి చేయొద్దని హెచ్చరిస్తున్నామన్నారు. సిజేరియన్లపై ప్రతి నెలా రివ్యూ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీలను పెంచేందుకు మిడ్‌‌వైఫరీ సిస్టమ్ ను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.